అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అడవుల్లో ముగిసిన జంతు గణన : ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఎస్.హెరామత్

 అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని అడవుల్లో ముగిసిన జంతు గణన : ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఎస్.హెరామత్

అమ్రాబాద్, వెలుగు: ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్-2026లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని 3 డివిజన్లలో 6 రోజులపాటు నిర్వహించిన జంతు గణన ఆదివారం ముగిసిందని ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఎస్.హెరామత్ తెలిపారు. సర్వేలో పాల్గొన్న వలంటీర్లు, సిబ్బందికి అటవీ శాఖ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. మాంసాహార, శాకాహార జంతువుల వివరాలు, వాటి కదలికలు, నివాస పరిసరాలపై సమాచారం సేకరించి, మొత్తం డేటాను ఆన్​లైన్‌‌‌‌‌‌‌‌లో అప్​లోడ్​చేసినట్లు పేర్కొన్నారు.

సర్వే నిర్వహణ, మొబైల్ అప్లికేషన్ వినియోగం, డేటా నమోదు అంశాలపై హైటీకాస్ సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇవ్వగా.. మొత్తం 65 మంది వలంటీర్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా పని చేశారని చెప్పారు. సర్వే రెండో రోజు వాచర్ దాసరి శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందగా, చివరి రోజు మరో వాచర్ ఉడుతనూరి సాయిలు ఎలుగుబంటి దాడిలో స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు.  

లింగాల రేంజ్ లో..

లింగాల, వెలుగు: లింగాల రేంజ్​లో జంతు గణన విజయవంతంగా ముగిసినట్లు ఎఫ్ఆర్వో ఈశ్వర్ తెలిపారు. మొత్తం 15 హెక్టార్ల విస్తీర్ణంలోని అడవిని 4 సెక్షన్లు, 13 బీట్స్ గా విభజించినట్లు పేర్కొన్నారు.  ఇక్కడ చిరుతపులులు, అడవి పిల్లులు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పలు, అడవి పందులు, నీల్​గాయి, ముళ్ల పందులు ఉన్నట్లు తెలిపారు.