Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్.

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad bhagat singh) ఒకటి. ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానున్నట్లు నేడు (మే 22న) అధికారికంగా ప్రకటించారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో షూటింగ్ మొదలవ్వనుంది చెప్పి పవర్ స్టార్ ఫ్యాన్స్లో జోష్ నింపారు. 

ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి వివరాలు వెల్లడించారు. “పవర్ స్టార్ బెస్ట్‌ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి. హరీశ్ శంకర్ రాసి, దర్శకత్వం వహించే ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నో ఏళ్లు సెలెబ్రేట్ చేసుకునేలా, గుర్తుండిపోయేలా ఉంటుంది. షూటింగ్ త్వరలో మొదలవుతుంది. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు” అని Xలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది.

పవన్ కల్యాణ్‍కు ఇష్టదైవమైన హనుమంతుడి జయంతి (2025 మే22) రోజున ఈ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. గతకొన్ని నెలల నుంచి ఈ మూవీ షూటింగ్ జూన్ 12 నుంచి షురూ కానుందని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మేకర్స్ షూటింగ్ అప్డేట్ ఇవ్వడంతో, జూన్ సెకండ్ వీక్ నుంచే మొదలవ్వనుందని తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. 

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే, రిలీజ్ చేసిన గ్లింప్స్ అంచనాలు పెంచేసింది. 

పవన్ కళ్యాణ్ సినిమాల వరుస అప్డేట్స్:

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్దమయ్యాడు. జూన్ 12న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇటీవలే సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ మూవీ షూటింగ్‍లో కూడా పాల్గొన్నాడు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌‌గా బిజీగా ఉండటంతో షూటింగ్‌‌కు బాగా గ్యాప్ వచ్చింది.

లేటెస్ట్ గా ఆయన ‘ఓజీ’ చిత్రానికి డేట్స్ కేటాయించారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌‌ను తిరిగి ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు. ‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతి త్వరలోనే  షూటింగ్ పూర్తవనుందని తెలుస్తోంది.

మరో ఇరవై ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్‌‌ ఈ చిత్రం షూటింగ్‌‌లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం.  యాక్షన్‌‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.