
సనాతన ధర్మం వివాదం..తమిళనాడు, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గురువారం (అక్టోబర్ 03) కాలినడకన తిరుమల వెళ్లిన ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..సనాతనధర్మంపై మాట్లాడుతూ..పరోక్షంగా తమిళనాడు డీసీఎం ఉదయనిధి స్టాలిన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు.
సనాతన ధర్మం వైరస్ లాంటిది.. దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందిని గతంలో ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పవన్ కళ్యాణ డైరెక్టుగా ఉదయనిధి స్టాలిన్ పేరు చెప్పకపోయినప్పటికీ పరోక్షంగా ఆయనకు హెచ్చరికలు పంపారు.
అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పొలైట్ గా స్పందించారు. ఓ నవ్వు నవ్వి..వెయిట్ ఎండ్ సీ.. అంటూ సమాధానమిచ్చారు.
గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ..సనాధన ధర్మాన్ని ఎవరూ తుడిచి పెట్టలేదు..ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే..వారే తుడిచిపెట్టు కుపోతారని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ డీసీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే వర్గాలు మండిపడ్డాయి.
పవన్ వ్యాఖ్యలపై డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా స్పందిస్తూ.. డీఎంకే ఏ మతం గురించి గానీ, ప్రత్యేకంగా హిందు మతం గురించి మాట్లాడదు. కుల దురాగతాలు, అంటరానితనం వంటి వివక్షలకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కొనసాగిస్తుందని అన్నారు.
మతాన్ని హిందూ దేవుళ్లను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్న బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ లే.. సనాతన ధర్మానికి అసలైన శత్రువులు అని అన్నారు. పవన్ తన వ్యాఖ్యలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం అన్నారు హఫీజుల్లా.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. చెన్నైలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు..దాన్ని తుడిచిపెట్టేయాలని అన్నారు.
సనాతన ధర్మం ఆలోచన సహజంగా నే తిరోగమన శీలమైనదని..కులం, మంతం, లింగ బేధాలతో ప్రజలను విడదీస్తుందన్నారు. సమానత్వం, సామాజిక న్యాయానికి సనాతన ధర్మం అనేది వ్యతిరేకమని ఉదయని స్టాలిన్ గట్టిగా వాదించారు.