సెట్స్ లో అడుగుపెట్టబోతున్న పవన్

సెట్స్ లో అడుగుపెట్టబోతున్న పవన్

సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ కొద్దికొద్దిగా తగ్గుతూ ఉండటంతో ఒక్కో సినిమా సెట్స్‌‌‌‌కి వెళ్తోంది. ఆల్రెడీ కొన్ని షూటింగులు మొదలైపోయాయి. ఇప్పుడు పవన్‌‌ కళ్యాణ్‌‌ సినిమా షూటింగ్ కూడా స్టార్టవుతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలకు కమిటైన పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జులై పదకొండు నుంచి ఆయన సెట్‌‌‌‌లో అడుగుపెడుతున్నారట. ముందుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. పవన్, రానా కలిసి నటిస్తున్న ఈ మూవీ టాకీ పార్ట్ ఇప్పటికే సగం పూర్తయ్యిందట. ఇప్పుడు మరో షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. దీని కోసం హైదరాబాద్‌‌‌‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేశారట. ఈ సెట్‌‌‌‌లోనే పవన్‌‌‌‌, రానాలపై ఇంపార్టెంట్ సీన్స్ తీయబోతున్నారు. మొదట ఓ ఫైట్‌‌‌‌ సీన్‌‌‌‌ను తెరకెక్కించనున్నారని సమాచారం. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎవరనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ ఐశ్వర్యా రాజేష్, నిత్యామీనన్ సెలెక్టయినట్టు ప్రచారం జరుగుతోంది. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి, ఈ సంవత్సరమే  ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.  క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారట. వీటితో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ పవన్ నటించాల్సి ఉంది.