
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొత్తులు మరోసారి తెరపైకి వస్తున్నాయి. జనసేన టీడీపీ, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీ, జనసేన పొత్తుపై క్లారిటీ ఉన్నా.. ఇంకా బీజేపీతో పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన చెరో రెండు చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించాయి. ముందు టీడీపీ పొత్తు ధర్మం విస్మరించిందని..తమతో చర్చించకుండానే టీడీపీ అభ్యర్థులను ఎలా ప్రకటిస్తుందని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించారు కాబట్టే తాము రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించామని చెప్పారు. ఈ క్రమంలో పవన్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ పొత్తుపై తేల్చుకునేందుకు పవన్ మరో రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారని ప్రచారం జరుగుతోంది. పొత్తుపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపనున్నట్లు సమాచారం. కేంద్రమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఫ్రిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. షెడ్యూల్ వచ్చేలోపు పొత్తులపై క్లారిటీకి రావాలని మూడు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.