
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. జులై 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీ మరోసారి వాయిదా పడనుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై బుధవారం టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఈ మూవీ రిలీజ్ డేట్‌పై వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది. అనుకున్న డేట్‌కే సాలిడ్‌గా వస్తున్నామని మేకర్స్ ప్రకటిస్తూ.. రిలీజ్‌కు ఇంకా నెల ఉందని కొత్త పోస్టర్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే, జూన్ 12న విడుదలవ్వాల్సిన ‘హరిహర వీరమల్లు’వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది.
జులై 4న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాంతో కింగ్‌డమ్ వాయిదా పడనుందని రూమర్స్ మొదలయ్యాయి. ఇక లేటెస్ట్ పోస్టర్తో కింగ్‌డమ్ రిలీజ్పై వచ్చింది. దానికితోడు USA ప్రీమియర్లు జులై3న ప్రదర్శించబోతున్నట్లు మేకర్స్ వీడియో సైతం రిలీజ్ చేశారు.
For every fan who waited...
— Shloka Entertainments (@ShlokaEnts) June 3, 2025
For every roar held back...
Your KING returns in 30 days. 👑⏳
అవసరం అయితే థియేటర్లు తగలపెట్టేదాం..💥💥😎 #Kingdom USA premiers on July 3rd
North America by Release by @ShlokaEnts
@TheDeverakonda @gowtam19 @AnirudhOfficial #BhagyashriBorse… pic.twitter.com/cfsGwp4cVc
‘హరిహర వీరమల్లు’వాయిదా:
క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన వీరమల్లు మూవీ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. షూటింగ్ ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్ గా జూన్ 12న వస్తోందని, జూన్ 8న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషించారు. కానీ ఇప్పుడు మరోసారి వాయిదా పడునుందనే వార్తలు ఊపందుకోవడంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు.
దానికితోడు నిర్మాత AM రత్నంకు హీరో పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ తీసుకున్న తన రెమ్యునరేషన్ రూ.11 కోట్లు తిరిగి ఇచ్చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో రిలీజ్ వాయిదా పడిందనే న్యూస్ నిజమే అని తెలుస్తోంది. మేకర్స్ ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.
ఇకపోతే, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న కింగ్‌డమ్ చిత్రానికి జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్స్. ఇటీవల విడుదలైన 'హృదయం లోపల' అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥
The battle for Dharma begins... 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr