
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ప్రచారం తెరపైకొచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా డెబ్భై శాతానికి పైగానే షూటింగ్ జరిగింది. దీంతో ఏపీ ఎన్నికల తర్వాత మిగతా భాగం షూటింగ్‌ను పూర్తి చేసి, సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే దిశగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘అత్తారింటికి దారేది’ కూడా సెప్టెంబర్ 27నే విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో పవన్‌కు ఎంతో కలిసొచ్చిన డేట్‌కి ఈ సినిమా వస్తోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.