కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలెట్ నోటీస్: క్షమాపణ చెప్పి.. రూపాయి ఫైన్ కట్టాలని డిమాండ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలెట్ నోటీస్: క్షమాపణ చెప్పి.. రూపాయి ఫైన్ కట్టాలని డిమాండ్

జైపూర్‌‌: అశోక్‌ గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్‌ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్‌ సీరియస్‌ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరు రూ.1 ఫైన్‌ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్‌ ఆరోపించారు. గెహ్లాట్‌ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ గతంలో ఆరోపించారు. పైలెట్‌ తనకు చాలా సార్లు డబ్బులు కూడా ఆఫర్‌‌ చేశారని అన్నారు. రూ.35కోట్లు ఇస్తానని ఆశ చూపారని రెండు సార్లు బేరసారాలు చేశారని మలింగ ఆరోపించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌‌ నుంచి పైలెట్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే పైలెట్‌ వాటిని తీవ్రంగా ఖండించారు. 7నెలల పాటు సైలెంట్‌గా ఉన్న మలింగ ఇప్పుడు ఒక్కసారిగా అబద్ధాలు చెప్తున్నారని ఆయన సీరియస్‌ అయ్యారు. కాంగ్రెస్‌పార్టీలోని ఒక వర్గం తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే.