మానసికంగా, శారీరకంగా ఎన్నో.. బయటకు రావడానికి 15 రోజులు పట్టింది

మానసికంగా, శారీరకంగా ఎన్నో.. బయటకు రావడానికి 15 రోజులు పట్టింది

ఆర్ఎక్స్ 100(RX 100) బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram). ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించిన ఈ రురల్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. అందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి        పాయల్ రాజ్‌పుత్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి, మంగళవారం సినిమా గురించి చాలా విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. 

సినిమా పరిశ్రమలో ప్రయాణం అనేది ఎవరికీ అంత ఈజీగా ఉండదు. ఎన్నో ఎత్తు పల్లాలు, ఆటు పోట్లు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏ స్థాయిలో ఉంటామో ఎవరికీ తెలియదు. అనుకోని పరిస్థితులు మనల్ని కిందకు తోసేస్తాయి. అవి మనకు చాలా బాధను కలిగిస్తాయి. నా తొలి సినిమా ఆర్‌ఎక్స్‌ 100కు తెలుగు ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివి. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత నటిగా జీవితంలో చాలా అవాంతరాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు మంగళవారం సినిమాలో కూడా నా పాత్ర మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఆ పాత్రతో చాలా కాలం ఎమోషనల్‌ జర్నీ చేశాను. అందుకే ఆ పాత్రనుంచి బయటకు రావటానికి 15 రోజులు పట్టింది. ఈ పాత్ర కూడా నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంది.. అంటూ చెప్పుకొచ్చింది పాయల్.