అలాంటి పాత్రలు చేయడానికి నేను సిద్ధం

V6 Velugu Posted on Jan 26, 2020

తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తోనే మంచి మార్కులు వేయించుకుంది పాయల్ రాజ్‌ పుత్. గ్లామర్ రోల్స్‌‌కే పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కూడా సిద్ధమంటోన్న ఆమె.. రీసెంట్‌‌గా ‘డిస్కోరాజా’తో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా పాయల్‌‌తో చిన్న చిట్‌‌చాట్.

రవితేజ సరసన వినలేని, మాట్లాడలేని అమ్మాయిగా నటించడాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నా. నిడివి తక్కువున్నా గుర్తింపొచ్చే పాత్ర. సైగలతో నటించడానికి డైరెక్టర్, రవితేజ బాగా సహకరించారు. ట్యూటర్‌‌‌‌ని కూడా పెట్టారు. మా కష్టం ఫలించింది. సినిమా విడుదలయిన తర్వాత నా పాత్రకు మంచిరెస్పాన్స్ వచ్చింది. నా స్నేహితుల దగ్గర నుంచి ఫిలిం క్రిటిక్స్ వరకు ప్రతి ఒక్కరూ నన్ను అభినందించారు. నా ఫోన్ మెసెజ్‌లతో నిండిపోయింది.రవితేజ గారు అందరికీ ఫేవరెట్ స్టారే. ఆయనతో మళ్లీమళ్లీ నటించడానికి సిద్ధంగా ఉంటాను . ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. మా ఇద్దరిపై తీసిన ‘నువ్వునాతో ఏమన్నా వో’ నాకు ఫేవరేట్ సాంగ్. ఆ పాటకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.‘ఆర్ఎక్స్ 100’ చిత్రం నాకు పేరుతో పాటు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమాతో నాకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. నా దగ్గరకు చాలా స్ర్కిప్ట్‌లు వచ్చాయి కానీ..మంచి స్ర్కిప్టులు మాత్రమే ఎంచుకుని ముందడుగు వేస్తున్నాను .‘ఆర్ ఎక్స్’తో యూత్‌‌ని, వెంకీమామతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని,‘ఆర్ డిఎక్స్ లవ్’తో ఫీమేల్ ఆడియెన్స్‌ని సంపాదించుకున్నాను . ప్రతి సినిమాలో విభిన్నపాత్రలు చేయాలనేదే నా ఆశ. అలాంటి పాత్రలు ఇస్తే చేయడానికి నేనెప్పుడూ సిద్ధం. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. ముంబైలో సెటిలయ్యాను . ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ముంబైలో ఇల్లు కొన్నాను . కానీ ఇప్పుడు తెలుగులో అవకాశాలు ఎక్కువయ్యాయి. అందుకే హైదరాబాద్ షిప్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం ఫీమేల్ సెంట్రిక్ తెలుగుమూవీలో నటిస్తున్నాను. దానిలో ఐపీఎస్ పాత్ర చేస్తున్నాను .షూటింగ్ పూర్తయిపోయింది. త్వరలో విడుదల కానుంది. అలాగే తమిళ, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను.

For More News..

తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్

 

Tagged actoress payal rajput, Disco raja, payal rajput, Ravi Teja

Latest Videos

Subscribe Now

More News