పేటీఎం నుంచి వెయ్యి మంది ఔట్​

పేటీఎం నుంచి వెయ్యి మంది ఔట్​

న్యూఢిల్లీ:  ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ సంస్థ పేటీఎం  పేరెంట్​కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. క్యాష్ ఫ్లోస్  పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. సంస్థ  "ఏఐ-ఆధారిత ఆటోమేషన్" సామర్థ్యాన్ని పెంచడం వల్ల చాలా మంది ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని పేర్కొన్నాయి.  

పేటీఎం  ప్రధాన చెల్లింపుల వ్యాపారంతో రాబోయే సంవత్సరంలో 15,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది మేలో వాటాదారులకు వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ లేఖ రాశారు. పేటీఎం  తదుపరి టార్గెట్​ సమీప భవిష్యత్తులో ఉచిత- నగదు- ప్రవాహాన్ని సానుకూలంగా ఉంచడమేనని పేర్కొన్నారు.