రూ.545 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టం

రూ.545 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టం

న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్​ కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్, మార్చి 31, 2025తో ముగిసిన నాలుగో క్వార్టర్​లో నష్టాలను రూ. 545 కోట్లకు తగ్గించుకుంది. గత క్యూ4లో కంపెనీ దాదాపు రూ. 551 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం మార్చి 2024 క్వార్టర్లో రూ. 2,267.1 కోట్ల నుంచి ఈ క్వార్టర్లో 15.7 శాతం తగ్గి రూ. 1,911.5 కోట్లకు చేరుకుంది.

 2025 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ నష్టం సగానికి పైగా తగ్గి రూ.645.2 కోట్లకు చేరుకుంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1,390.4 కోట్లు ఉందని పేటీఎం తెలిపింది.