PBKS vs DC ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్ : ధర్మశాలలో వర్షం పడుతుందా.. మ్యాచ్ జరుగుతుందా..?

PBKS vs DC ఫైనల్ కాని ఫైనల్ లాంటి మ్యాచ్ : ధర్మశాలలో వర్షం పడుతుందా.. మ్యాచ్ జరుగుతుందా..?

ఐపీఎల్ 2025లో కీలకమైన మ్యాచ్ జరగబోతుంది.. ఫైనల్ కంటే ఉత్కంఠ పోరుకు ధర్మశాల వేదిక అయ్యింది. 2025, మే 8వ తేదీ సాయంత్రం 7.30 గంటలకు.. పంజాబ్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. లీగ్ దశలో జరుగుతున్న ఫైనల్ లాంటి మ్యాచ్ గా ఇది ఉండబోతుంది. దీనికి కారణం లేకపోలేదు.

ఇప్పటికే పంజాబ్ కింగ్స్ జోరు మీదుంది. 15 పాయింట్లతో మూడో స్థానంలో ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ఇదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ సైతం 13 పాయింట్లతో.. ఐదో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్ ర్యాంక్ మెరుగుపరుచుకోవటానికి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ధర్మశాలలో ఇవాళ ( మే 8 ) మధ్యాహ్నం వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ పై ఫ్యాన్స్ లో కాస్త టెన్షన్ నెలకొంది. ఇంతకీ ధర్మశాలలో వాతావరణం ఎలా ఉండనుంది.. ఏ ఆటంకం లేకుండా మ్యాచ్ జరుగుతుందా లేదా ఇప్పుడు చూద్దాం.

ధర్మశాలలో వాతావరణం విషయానికొస్తే వాతావరణం విషయానికొస్తే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత దాదాపు 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని తెలుస్తోంది.. మధ్యాహ్నం వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం క్లియర్ గా ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఏ ఆటంకం లేకుండా మ్యాచ్ జరుగుతుందని చెప్పచ్చు.

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్లు ఈ సీజన్లో దూకుడు ప్రదర్శించి ప్లేఆఫ్స్ కి అడుగు దూరంలో ఉన్నాయి. అయితే.. పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదవ స్థానంలో ఉంది. ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఢిల్లీని ఓడించగలిగితే, నాకౌట్ దశకు అర్హత సాధించిన మొదటి జట్టు అవుతుంది. మరి, ఈ మ్యాచ్ లో విజయం సాధించి పంజాబ్ నాకౌట్ దశకు చేరుకుంటుందా లేక ఢిల్లీ విజయం సాధించి టేబుల్ లో తన స్థానాన్ని మెరుగు పరుచుకుంటుందా అన్నది ఈ సాయంత్రం తేలనుంది.