PBKS vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో గెలుపులతో దూసుకుపోతూ, ఐదు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం కాస్త ఒడిదుడుకులనే ప్రారంభమైంది. 3 మ్యాచ్‌లలో ఒక దాంతో గెలిచి, రెండు ఓటములతో రెండు పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్ విభాగంలో హైదరాబాద్ స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా, పంజాబ్ జట్టు బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తుంది. ముల్లన్పూర్ పిచ్‌పై ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు అభిమానులకు కనువిందు చేయనుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఐపీఎల్ చరిత్రని పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 24 సార్లు పోటీ పడగా, అందులో 14 సార్లు హైదరాబాద్ గెలవగా, పంజాబ్ కింగ్స్ కేవలం 7 సార్లు మాత్రమే విజయం సాధించింది. గడిచిన కొన్నేళ్లుగా ఆరెంజ్ ఆర్మీ పంజాబ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. 2024 సీజన్లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ హైదరాబాద్ విజయం సాధించినప్పటీకి, అంతకుముందు 2023లో కూడా ఆ జట్టుదే పైచేయిగా నిలిచింది. పంజాబ్ లాస్ట్ టైం 2022లో హైదరాబాద్‌ను ఓడించింది.
సరికొత్త రికార్డ్:
గత ఏడాది పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేసేశాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 245 రన్స్ చేసింది. కానీ 246 పరుగుల భారీ టార్గెట్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదైన మ్యాచ్‌లలో ఇది ఒకటిగా నిలిచిపోయింది.
Also Read : రాజస్తాన్‌కు వరుసగా నాలుగో విజయం
గత రికార్డులు హైదరాబాద్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ పంజాబ్‌కు కొంత ఊరట ఇస్తుంది. ఈ మ్యాచులో గెలిచి పంజాబ్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుండగా, హైదరాబాద్ తిరిగి ఫామ్‌లోకి రావాలని కసితో బరిలోకి దిగుతుంది. ఈ పోరులో బౌలర్ల పోరాటమా లేక బ్యాటర్ల విధ్వంసమా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
