Cricket World Cup 2023: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం..మొత్తం సెలక్షన్ కమిటీపై వేటు

Cricket World Cup 2023: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం..మొత్తం సెలక్షన్ కమిటీపై వేటు

వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన చేసిన పాక్ సెమీస్ కు రాకుండానే ఇంటిముఖం పట్టింది. చిన్న జట్లపై విజయాలు నమోదు చేసినా పెద్ద జట్లపై పూర్తిగా తేలిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ పై గెలవలేక చిత్తుగా ఓడింది. ఆసియా కప్ లో కనీసం ఫైనల్ కు చేరుకోలేకపోయిన బాబర్ సేన వరల్డ్ కప్ లో లీగ్ దశతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. సెలక్షన్ కమిటీ మొత్తాన్ని రద్దు చేస్తన్నట్లు ప్రకటించింది.       

చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ రాజీనామా తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తన సెలక్షన్ కమిటీని పునర్నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను రద్దు చేసింది. వీరి స్థానంలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం జాతీయ జట్టు ఎంపికకు కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలియజేసింది. తొలగించబడిన కమిటీలో తౌసీఫ్ అహ్మద్, వసీం హైదర్ వంటి ప్రముఖులు ఉన్నారు. 

కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటుపై పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ జకా అష్రఫ్ సీనియర్ క్రికెటర్లతో చర్చలు ప్రారంభించారు. గడాఫీ స్టేడియంలో ఈ సమావేశాలు జరిగాయి. అనుభవం ఉన్న క్రికెటర్లతో చర్చించడం ద్వారా మంచి సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రతిభగలవారిని గుర్తించి సెలక్షన్ బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యులను చేర్చుకోవడం ద్వారా జాతీయ జట్టు పనితీరును విశ్లేషించి మెరుగు పరచడమే PCB లక్ష్యం అని జకా అష్రఫ్ పేర్కొన్నారు.      

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)