ఖర్గే మీటింగ్ను సక్సెస్ చేయాలి..పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలిరావాలి : పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్

ఖర్గే మీటింగ్ను సక్సెస్ చేయాలి..పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలిరావాలి : పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్  చీఫ్​ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ సభను సక్సెస్​ చేయాలని నేతలకు పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 4న హైదరాబాద్‌‌లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న పార్టీ కార్యకర్తల సభలో ఖర్గే పాల్గొని, సంస్థాగత బలోపేతంపై క్యాడర్​కు దిశానిర్దేశం చేయనున్నారని ఆయన చెప్పారు. మంగళవారం గాంధీ భవన్ లో రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.

మహేశ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ శాఖల కాంగ్రెస్ అధ్యక్షులతో ఖర్గే సమావేశమవుతారని, దీనికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఖర్గే సభను సక్సెస్​ చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలో ఖర్గే వివరిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్ చార్జి రామ్మోహన్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పాల్గొన్నారు.