
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలనలో ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉండాలనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్ ‘గాంధీ భవన్లో అందుబాటులో ప్రజాప్రతినిధులు’ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారని రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఫహీం ఖురేషీ, చల్లా నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన ప్రోగ్రామ్లో ఇద్దరు చైర్మన్లు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ..ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను తీసుకొని చర్యలు చేపట్టామని చెప్పారు.
కొన్ని సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించగా.. మరికొన్నింటిని సంబంధిత శాఖలకు సిఫారసు చేశామని పేర్కొన్నారు. ఎక్కువగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే సమస్యలు తమ దృష్టికి బాధితులు తీసుకువచ్చారని వారు వెల్లడించారు.