
సంగారెడ్డి, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న 230 క్వింటాళ్ల పీడీఎస్రైస్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీలో 230 క్వింటాళ్ల రైస్ ను గుర్తించారు.
లారీ డ్రైవర్ సయ్యద్ షా ను అదుపులోకి తీసుకొని విచారించగా తన యజమాని జల్లప్ప ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్లు చెప్పాడు. లారీతో పాటు డ్రైవర్నుఅదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం రూరల్ పోలీస్ స్టేషన్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు.