
కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ స్టేట్ చీఫ్ఎస్వీ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాణాప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ, లీడర్లు పాల్గొన్నారు.