
బషీర్బాగ్, వెలుగు: విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు సోమవారం తొలుత బషీర్ బాగ్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ నవీన్ నికోలస్ కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, వంటషెడ్లు, ప్రహరీ గోడలు వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.శిథిల భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని కోరారు. అనుమతులు లేని కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంతోపాటు ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.