సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : పీడీఎస్​యూ నాయకులు

సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : పీడీఎస్​యూ నాయకులు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్​యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పట్టణంలోని డిగ్రీ,  పీజీ కాలేజ్​ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, టీపీటీఫ్, డీటీఫ్ సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్,  స్కాలర్షిప్స్, హాస్టల్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు.

 ప్రజా సంఘం నాయకుడు జాన్ వెస్లీ, ఏఐపీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, న్యాయవాది బైరి ప్రవీణ్ మాట్లాడుతూ సిద్దిపేట అగ్రికల్చర్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్​ చేశారు.  కార్యక్రమంలో పీడీఎస్​యూ ఇంజనీరింగ్ వింగ్ కన్వీనర్ వెంకట్, న్యాయవాదులు విజయ్ కుమార్, శివ, గర్ల్స్ కన్వీనర్ రేణుక, అక్షిత పాల్గొన్నారు.