
‘నారప్ప’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నుండి వస్తున్న చిత్రం ‘పెదకాపు’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ లీడ్ రోల్స్ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ న్యూ ఏజ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి ‘చనువుగా చూసే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ప్రోమోను మంగళవారం విడుదల చేశారు.
ALSO READ :సినిమా, రాజకీయం ఏ ఒక్కరిదీ కాదు
మిక్కీ జె మేయర్ కంపోజ్ చేసిన మెలోడి ట్యూన్, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ఆకట్టుకున్నాయి. వీడియోలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేస్తోంది. పూర్తి పాటను జులై 27న విడుదల చేయనున్నారు. రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు, నరేన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.