మాదారంలో ముగిసిన పెద్దమ్మ తల్లి కొలుపు

మాదారంలో ముగిసిన పెద్దమ్మ తల్లి కొలుపు

ములకలపల్లి, వెలుగు :  మండలంలోని మాదారం గ్రామంలో ఆరు రోజులుగా జరుగుతున్న పెద్దమ్మతల్లి కొలుపు ఆదివారం నిప్పుల గుండం ప్రవేశంతో ముగిసింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నాయక పోడు జాతి కులస్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలవడం ఆనవాయితీ. గ్రామంలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక ఆలయ ఏర్పాటు చేశారు. ఆరు రోజులపాటు రోజుకో కార్యక్రమం నిర్వహించారు. 

ఆదివారం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి తెచ్చిన నిండు నీళ్ల బిందెలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అగ్ని నిప్పు మంటలపై నడుచుకుంటూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో ఆరు రోజుల కొలువు ముగిసింది. అనంతరం భక్తులు ఆలయం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. గణాసారులు గంప బోడయ్య, గణప సత్యం, గంపచుక్కమ్మ, కంకటి అక్కమ్మ, పశుల బుచ్చయ్య, రాజ సూర్య, ముదిగొండ కృష్ణ, కురం రాజు, సందీప్ కొలువును నిర్వహించారు.  మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, కాంగ్రెస్ మండల నాయకులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.