
గోదావరిఖని, వెలుగు: పోక్సో కేసులో నింది తుడికి పదేండ్ల జైలుశిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జి కె.సునీత శుక్రవారం తీర్పు ఇచ్చారు. గోదావరిఖనిలోని గాంధీపార్క్స్కూల్స్వీపర్షేక్సర్వర్2019లో అదే స్కూల్లో చదివే ఐదో క్లాస్ బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఆపై బాలికను కొట్టి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అప్పటి గోదావరిఖని వన్‌టౌన్ సీఐ రమేశ్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో వాదోపవాదాల జరగ్గా నిందితుడు షేక్ సర్వర్ పై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.