
పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం హైదరాబాద్ నుంచి చెన్నూరు వెళ్తుండగా పెద్దపల్లిలోని కమాన్ వద్ద లీడర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ వారితో కలిసి టీ తాగి కాసేపు వారితో మాట్లాడారు. కార్యక్రమంలో దిశ కమిటీ మెంబర్ సయ్యద్ సజ్జద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఏలువాక రాజయ్య, బాలస్వామి సతీశ్, గంగుల సంతోష్, బొంకూర్ కైలాసం, శ్రీనివాస్ తదితరులున్నారు