
సుల్తానాబాద్, వెలుగు: అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, తొగర్రాయి గ్రామాల్లో శుక్రవారం రూ.1.05 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం వారితో కలిసి లంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇస్తున్నట్లు చెప్పారు.
గర్రెపల్లి నుంచి పెగడపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయనతోపాటు లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, లీడర్లు మహేందర్, దామోదర్ రావు, రాములు, అబ్బయ్య గౌడ్, అధికారులు పాల్గొన్నారు