కోల్బెల్ట్, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా కనెక్టివిటీ, మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలోని రోడ్లుఅండర్బ్రిడ్జిల పెండింగ్పనులను త్వరగా పూర్తి చేయాలని రైల్వే ఆఫీసర్లతో ప్రత్యేకంగా చర్చించినట్లు చెప్పారు. ఎల్సీ 30, ఎల్సీ 35, ఎల్సీ 37 ప్రాంతాల్లో నేచురల్ డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆఫీసర్లు దృష్టికి తీసుకెళ్లానన్నారు. స్పందించిన రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలో రోడ్డు పనులు, హెచ్ఎల్బీల నిర్మాణాలపై కేంద్రమంత్రి దృష్టికి..
మంచిర్యాల జిల్లా ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యం, ప్రాంతాల మధ్య కనెక్టివిటీని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. పెండింగ్ రోడ్డు పనులు, హైలెవల్బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వైడెనింగ్, బలోపేతం పనులు త్వరగా పూర్తిచేయాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సంబంధిత ఆఫీసర్ల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, జైపూర్ మండలాల పరిధిలో16 కి.మీ. మేర రూ.40 కోట్ల వ్యయంతో చిర్రకుంట, ఆదిల్పేట, వెంకటాపూర్, ముదిగుంట మీదుగా రసూల్పల్లి రోడ్డు వరకు హైలెవల్బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల వైడనింగ్, బలోపేతం పనులు పూర్తి చేయాలని రెండేండ్లుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని త్వరలో పనులు చేపట్టే అవకాశంఉందన్నారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు.
