
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం గోదావరిఖనిలో పర్యటించారు. ఈ సందర్భంగా బస్టాండ్ఏరియాలో ఎంపీకి కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ప్రశాంత్ నగర్‌లో 5వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య కొడుకు శ్రీహరి వివాహం ఇటీవల జరగగా వారి ఇంటికి వెళ్లి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
పవర్ హౌస్ కాలనీలోని తన అనుచరుడు శ్రావణ్ ఇంటికి వెళ్లి ఆయన కొడుకును ఆశీర్వదించారు. లీడర్లు పి.మల్లికార్జున్, సజ్జద్, మల్లేశ్‌యాదవ్, తిప్పారపు మధు, గడ్డం మధు, నర్సింగ్దొర ఉన్నారు.