
- ఇటీవల ఇసుక లారీ ఢీకొని ఒకరి మృతి
- బాధిత కుటుంబానికి ఎంపీ పరామర్శ
హైదరాబాద్: జయశంకర్భూపాలపల్లి కాటారంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై సీఎం, మంత్రి శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేస్తామని, ఇసుక అక్రమార్కులను వదిలే ప్రసక్తి లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన రాజలింగు అనే వ్యక్తిని ఇటీవల ఇసుక లారీ ఢీకొట్టి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్థానిక నాయకులతో కలిసి కాటారంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ క్రమంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అక్రమ ఇసుకదందాపై ఎంపీ ఫైర్అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక దందాతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి అక్రమ దందాను ప్రోత్సహించదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.