పెద్దపల్లి బీఆర్ఎస్​లో వర్గపోరు.. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కొట్టుకున్నారు..

పెద్దపల్లి బీఆర్ఎస్​లో వర్గపోరు.. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు కొట్టుకున్నారు..

పెద్దపల్లిలో గులాబీ నేతలమధ్య రగడ మొదలైంది.  జిల్లాపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలనుద్దేశించి  ప్రసంగించారు. తరువాత కొంతమంది నేతలు కవితతలో ఫొటోలు దిగేందుకు సిద్దమయ్యారు. ఫొటో సెషన్​ లో భాగంగా   పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్  వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.  ఇంతకాలం బీఆర్​ఎస్​ నేతల మధ్య  అభిప్రాయ బేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇరువర్గాల కార్యకర్తల బూతు పురాణాన్ని చదివారు.  ఉద్రిక్త పరిస్థితులు పెచ్చు మీరుతున్న తరుణంలో ద్వితీయ శ్రేణి నాయకులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల కార్యకర్తలకు నచ్చజెచ్చి శాంతింపజేశారు.