
కొత్త బంగారు లోకం(Kotha bangaru lokam) ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth addala) దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ పెదకాపు 1(Pedakapu1). రూరల్ అండ్ పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ(Virat karna) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా..గ్రామాల్లో ఉండే వర్గ పోరు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని అర్థమవుతోంది.
లేటెస్ట్గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు (సెప్టెంబర్ 23న) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా తెలంగాణ ఐటీ మినిస్టర్(Minister KTR) కేటీఆర్ రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పెదకాపు మేకర్స్..మంత్రి కేటీఆర్ ని అడిగారట. ఈ ఫంక్షన్కి రావడానికి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక, కేటీఆర్ తో పాటు మరి కొందరు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లు టాక్.
ఆ ప్రముఖుల్లో డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ లను పిలిచారని వినిపిస్తోంది. ఇంకా ఎలాంటి కన్ఫర్మ్ అప్డేట్ మేకర్స్ ఇవ్వకపోయినప్పటికీ..వీరి రాక కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ ని కూడా పిలిచినట్లు టాక్. ఈ మూవీ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి బ్యానర్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే.దీంతో బాలయ్య బాబు వస్తాడని సినీ వర్గాల సమాచారం. ఇక శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ ను కూడా పిలిచినట్లు తెలుస్తుంది. మరి చీఫ్ గెస్ట్గా వచ్చేదెవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
పెదకాపు మూవీని ద్వారకా క్రియేషన్స్(Dwarakacreations) బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణకి జోడీగా ప్రగతి శ్రీవాస్తవ నటిస్తున్నారు. వీరిద్దరికీ ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. మెలోడీ మిక్కీ జే మేయర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
The Grand Pre-Release Event of #PeddhaKapu1 will be held on 23rd Sep @ 6 PM ?
— Dwaraka Creations (@dwarakacreation) September 21, 2023
? Shilpakala vedika, HYD
@ViratKarrna @officialpragati @SrikanthAddala_ @MickeyJMeyer @Editormarthand @NaiduChota @mravinderreddyy @dwarakacreation @divomusicindia @MediaYouwe @UrsVamsiShekar pic.twitter.com/rnwRh4hrGX