రాంచరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘పెద్ది’ ప్రీమియర్ షోస్ సందడి మొదలైంది. ఈ వార్త రాసే సమయానికి.. ‘పెద్ది’ ఫస్టాఫ్ టాక్ వచ్చేసింది. ప్రేక్షకులతో పాటు సినీ రివ్యూయర్లు ‘ఎక్స్’లో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఫస్టాఫ్పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొందరు ఫస్టాఫ్ అదిరిపోయిందని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తే.. మరికొందరు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకూ దర్శకుడు బుచ్చిబాబు, రాంచరణ్, ఏఆర్ రెహ్మాన్ చేసిన డ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయిపోవడం ఖాయం అంటున్నారు.
ముఖ్యంగా.. ఏఆర్ రెహ్మాన్ అందించిన ఆర్ఆర్ ఈ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని చెప్తున్నారు. 'రయ్ రయ్ రా రా' పాట విజువల్గా అద్భుతంగా ఉందని వన్ సైడ్ టాక్ వచ్చేసింది. రాంచరణ్ డ్యాన్స్ను అభిమానులు మనసారా ఆస్వాదిస్తారని ఫస్టాఫ్ టాక్పై ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. జాన్వీ కపూర్ ఎపిసోడ్లు పర్వాలేదనిపించాయని టాక్. భావోద్వేగభరితంగా సాగే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్.. సెకండాఫ్కు ప్రాపర్ లీడ్ ఇచ్చేలా సాగిన ఇంటర్వెల్ను ఎంజాయ్ చేయడం ఖాయం అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పేశారు.
‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్లో కూడా దర్శకుడు బుచ్చిబాబుతో పాటు సినిమా టీం సెకండాఫ్ గురించే ఎక్కువగా చెప్పారు. చివరి 50 నిమిషాలు గుండెలు పిండేసేలా ఉంటుందని.. భావోద్వేగానికి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడని బుచ్చిబాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సెకండాఫ్ ఆశించిన రీతిలో ఉంటే.. బుచ్చిబాబు, రాంచరణ్ ‘పెద్ది’ సినిమా మరో ‘రంగ స్థలం’లా టాలీవుడ్ బాక్సాఫీస్ను బద్ధలు కొట్టడం ఖాయం.
