విప్రో గూటికి గుడ్ హోమ్‌‌‌‌, ఈవా

విప్రో గూటికి గుడ్ హోమ్‌‌‌‌, ఈవా

న్యూఢిల్లీ:  ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీ విప్రో కన్స్యూమర్ కేర్ అండ్‌‌‌‌ లైటింగ్, హెల్త్‌‌‌‌కేర్ రంగ సంస్థ టీటీకే హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌కి చెందిన  ‘గుడ్ హోమ్’, ‘ఈవా’ బ్రాండ్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. 

డీల్‌‌‌‌ విలువ రూ. 256 కోట్లు. హోమ్, పర్సనల్ కేర్ విభాగాలకు సంబంధించి  విప్రోకు ఇది 17వ కొనుగోలు. ఈవా బ్రాండ్ బాడీ స్ప్రేలు, డియోడరెంట్లు, టాల్కమ్ పౌడర్లలో  పాపులర్ కాగా,  గుడ్ హోమ్ బ్రాండ్ ఎయిర్ కేర్, స్క్రబర్లు, డ్రెయిన్ క్లీనర్ల విభాగంలో విస్తరించి ఉంది.

 2025–26లో ఈ రెండు బ్రాండ్లు కలిపి రూ. 148 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.  టీటీకే హెల్త్‌‌‌‌కేర్ మొత్తం టర్నోవర్‌‌‌‌లో వీటి వాటా 17శాతంగా ఉంది.  రానున్న సెప్టెంబర్ 30 నాటికి డీల్‌‌‌‌ పూర్తవుతుంది.