విశ్వేష తీర్థ స్వామి శివైక్యం: సంతాపం తెలిపిన మోడీ

విశ్వేష తీర్థ స్వామి శివైక్యం: సంతాపం తెలిపిన మోడీ

ఉడుపి: పెజవార మఠాధిపతి విశ్వేష తీర్థ స్వామి పరమపదించారు. ఆదివారం పొద్దున 9 గంటల 30 నిమిషాలకు మఠంలోనే వారు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వారు ఆనారోగ్యంతో ఉన్నారు. స్వామీజీ కోరిక మేరకు నిన్న రాత్రే హాస్పిటల్  నుంచి మఠానికి తీసుకెళ్లారు వారి శిష్యులు. విశ్వేష తీర్థ స్వామి 1931 ఏప్రిల్ 27న కర్ణాటకలోని రామకుంజలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటరామ. 8 ఏళ్ల వయసులోనే వారు సన్యాసం స్వీకరించారు.

విశ్వేష తీర్థ స్వామి శివైక్యం బాధించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గురుపూర్ణిమనాడు తామిద్దరం కలిశామని..  స్వామీజీనుంచి నేర్చుకోవడానికి అవకాశం అభించిందని తెలిపారు. ఆ సమావేయం తన జీవితంలో గుర్తుండిపోతుందని అన్నారు. మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా కూడ స్వామీజీ శివైక్యంపై తన సంతాపాన్ని తెలిపారు.