
ఉత్తర తెలంగాణలో వర్షాల బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కుమ్రంభీం జిల్లాలో వానలకు పెన్ గంగా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి తోడు ఎగువన కురిసిన వర్షాలతో నది మరింత ఉవ్వెత్తున ప్రవహిస్తోంది.
కుమ్రంబీమ్ జిల్లా హుడ్కిలిలో పెన్ గంగా (వార్ధా) నది భయంకరంగా ప్రవహిస్తోంది. లోలేవల్ వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ALSO READ : యమునా నది వరదలు..
మరోవైపు సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద తెలంగాణ--మహారాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెనను తాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.