ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : పెండింగ్స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక వినాయక్ చౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ కైరి శశి, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
