
ముంబై : మన ఇంటికి వచ్చే నల్లా బిల్లు టైంకు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటారు. నెలకు రూ. 100 నుంచి మహా అంటే 150 బిల్లు కోసం వాటర్ సిబ్బంది బిల్లు కట్టాలంటూ తిరుగుతారు. అదే లక్షల్లో పెండిగ్ లో ఉన్న అధికారుల నల్లా బిల్లును మాత్రం పట్టించుకోరు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజల అందరి నోటా ఇదే మాటా. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ కొన్నేళ్లుగా నల్లా బిల్లు కట్టడం లేదట. అలా బకాయిలు పేరుకుపోయి పెండింగ్ బిల్లు రూ. 7లక్షలకు చేరింది. దీంతో సీఎం బంగ్లాను ఎగవేతదారు జాబితాలో చేర్చించి (బీఎంసీ).
ముంబైలోని మలబార్‌హిల్స్ ప్రాంతంలో ఉన్న ఫడణవీస్ అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లా 2001 నుంచి నీటి బిల్లు చెల్లించట్లేదని.. సహ చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బీఎంసీ సమాధానమిచ్చింది. అప్పటి నుంచి పెండింగ్ బిల్లు రూ. 7,44,981కి చేరడంతో వర్షా బంగ్లాను ఎగవేతదారుగా ప్రకటించినట్లు తెలిపింది. ముఖ్యమంత్రే కాదు.. మహారాష్ట్ర మంత్రులు సుధీర్ ముంగతివార్, పంకజా ముండే, రామ్‌దాస్ కదమ్ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా ఎగవేతదారుల జాబితాలో చేర్చినట్లు తెలిపింది. రూల్స్ ప్రజలకే కానీ..అధికారులకు పట్టవంటూ సీరియస్ అవుతున్నరు రాష్ట్ర ప్రజలు.