ఎటు చూసినా వరదలే.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

ఎటు చూసినా వరదలే.. బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

ఎటు చూసినా వరదలే

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం

వడగండ్ల వానతో సిటీ అతలాకుతలం

బెంగళూరు : భారీ వర్షం బెంగళూరును ముంచెత్తింది. ఉరుములు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో సిటీ అతలాకుతలం అయింది. చెట్లు నేలకూలాయి, కార్లు, బండ్లు వరదలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు కరెంట్ కట్ అయింది. నగరంలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు హై అలర్ట్ ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టారు. మైసూరులోనూ కుండపోత వర్షం కురిసింది. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది.

ముందస్తు రుతుపవనాలు బెంగళూరును నాశనం చేస్తున్నాయని కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ప్రీ మాన్​సూన్ ఎఫెక్ట్​ను ఎదుర్కొనేందుకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం మంగళవారం భేటీ అయ్యారు. వర్షాల ఎఫెక్ట్​తో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 52మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు. ఈ వర్షాలకు 814 ఇండ్లు దెబ్బతిన్నాయని, 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించామని, పంట నష్టంపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. 

ఫస్ట్ నాటికి 63 కంట్రోల్ రూమ్​లు

వర్షం, వరద ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్లాన్ రెడీ చేసింది. సిటీ అంతటా సబ్​డివిజనల్ స్థాయిలో 63 కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

హీట్ వేవ్స్ ముగిసినయ్ : ఐఎండీ

వేడి గాలులు, ఉక్కపోత నుంచి జనాలకు ఉపశమనం కలగనుందని ఐఎండీ ప్రకటించింది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా టెంపరేచర్లు తగ్గుముఖం పడతాయని చెప్పింది.