అకౌంట్లో డబ్బులు లేకపోయినా రూ.80 వేలు డ్రా చేసుకోండి.. ఏటీఎంల దగ్గర కస్టమర్ల క్యూ

అకౌంట్లో డబ్బులు లేకపోయినా రూ.80 వేలు డ్రా చేసుకోండి.. ఏటీఎంల దగ్గర కస్టమర్ల క్యూ

మీ అకౌంట్లో డబ్బులు లేవా.. డోంట్ వర్రీ వెయ్యి డాలర్లు.. అంటే మన కరెన్సీలో 80 వేల రూపాయల వరకు డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బులను తర్వాత మీ మీ డిపాజిట్లు, ఇతర సేవింగ్స్ నుంచి మినహాయిస్తాం.. ఇప్పటి వరకు వెయ్యి డాలర్లను ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు అని ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్. దీంతో ఐర్లాండ్ దేశంలోని బ్యాంక్ ఖాతా ఉన్న అందరూ ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు. అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అనేది సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరూ వెయ్యి డాలర్లు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఎందుకిలా జరిగింది.. దీనికి కారణాలు ఏంటో చూద్దాం...

బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్  ఆన్ లైన్ వ్యవస్థ కుప్పకూలింది. యాప్ పని చేయలేదు.. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆన్ లైన్ లావాదేవీలు ఆగిపోయాయి. దీంతో బ్యాంక్ ఓ నిర్ణయం తీసుకున్నది. కస్టమర్ల అవసరాల కోసం.. బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి కస్టమర్.. ఏటీఎం నుంచి వెయ్యి డాలర్ల వరకు నగదును విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. మరి ఈ డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదా అంటే.. కచ్చితంగా ఉంది. కాకపోతే ఇప్పటికి ఇప్పుడు కాదు.. తర్వాత కాలంలో మీరు బ్యాంక్ ద్వారా జరిపే లావాదేవీల నుంచి ఈ వెయ్యి డాలర్లను మినహాయిస్తుంది బ్యాంక్.

 దీంతో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేనోళ్లు కూడా.. ఇప్పటికి అయితే వెయ్యి డాలర్లు వస్తున్నాయి కదా అని.. ఏటీఎంల దగ్గర క్యూ కట్టారు. వెయ్యి డాలర్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ఐర్లాండ్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ ఏటీఎంలు కిలకిటలాడాయి. భారీ క్యూలు ఉన్నాయి. ఒక్కొక్కరూ రెండు, మూడు గంటలు క్యూలో ఉండి మరీ వెయ్యి డాలర్లు విత్ డ్రా చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ సమస్యను గుర్తించి, మొబైల్ యాప్‌తో  పాటు సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లుగా తెలిపింది.