వంతెనపై దేవకన్యల కాలనీ.. వీడియో వైరల్

వంతెనపై దేవకన్యల కాలనీ.. వీడియో వైరల్

ఇప్పటి వరకు మీరు వంతెనపై నిర్మించుకున్న చిన్న చిన్న దుకాణాలను మాత్రమే చూసి ఉంటారు. కానీ వంతెనపై ఇల్లు నిర్మించుకుని నివసించే వారిని ఎప్పుడైనా చూశారా..? ఒకవేళ చూసినా అది అరుదుగానే చూసి ఉంటారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వంతెన పైన మొత్తం ఓ కాలనీ కనిపిస్తోంది. మీరు ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాన్ని చూసి ఉండరు.

ఈ రోజుల్లో వంతెనపై నిర్మించిన ఇళ్లు చర్చనీయాంశంగా మారాయి. దీనిని వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ స్థావరం సాధారణ గ్రామాలు, స్థావరాల వలె నేలపై నిర్మించబడలేదు, కానీ గాలిలో అనేక అడుగుల ఎత్తులో ఉన్న వంతెనపై నిర్మించబడింది. నెటిజన్లు దీనిని దేవకన్యలకు నిలయంగా, కలల నగరంగా పిలుస్తున్నారు.

ఇంత అందమైన ప్రదేశంలో జీవించాలనుకుంటున్నారా?

చైనాలోని చాంగ్‌కింగ్‌లో ఉన్న ఈ కాలనీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బ్రిడ్జి మీద రంగురంగుల ఇళ్ళు కనిపిస్తున్నాయి. వంతెన కింద ఒక నది ప్రవహిస్తోంది. చూసేందుకు ఎంతో కనువిందుగా ఉన్న ఈ ప్రాంతాన్ని చాలా మంది దేవకన్యల కాలనీ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వాతావరణంలో నివసించాలంటే డబ్బున్న వాళ్లకే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మామూలు ప్రజలు నివసించడం చెప్పుకోదగిన విషయం.

ఈ టౌన్‌షిప్ 400 మీటర్ల పొడవైన వంతెనపై స్థాపించబడింది. ఇది సందర్శకులను సైతం ఎంతో ఆకర్షిస్తోంది. ఇక్కడ 13 వేలకు పైగా వంతెనలు ఉన్నాయి. నిరుపయోగంగా మారిన వంతెనలను స్టేడియంలుగా, వినోద ప్రదేశాలుగా, పార్కింగ్‌ స్థలాలుగా మార్చారు. టౌన్‌షిప్‌కి సంబంధించిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకోగా... కొన్నిసార్లు ఇది కూడా ప్రమాదకరమేనని కొందరు హెచ్చరిస్తున్నారు.

https://twitter.com/hvgoenka/status/1647165660001370112