గన్​కల్చర్.. స్టిల్​ కంటిన్యూ.. యూఎస్​లో దుండగుడి కాల్పుల్లో నలుగురి మృతి

గన్​కల్చర్.. స్టిల్​ కంటిన్యూ.. యూఎస్​లో దుండగుడి కాల్పుల్లో నలుగురి మృతి

అమెరికాలో మరో సారి తుపాకీ గర్జించింది. జార్జియా రాష్ట్రం హెన్రీ కౌంటీలోని హాంప్టన్‌ ప్రాంతంలో ఓ దుండగుడు జులై 15న జరిపిన కాల్పుల్లో నలుగురు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నట్లు వెల్లడించారు. 

ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం బృందాలు గాలిస్తున్నాయని హాంప్టన్‌ పోలీస్ చీఫ్ జేమ్స్ టర్నర్ వెల్లడించారు. దుండగుడు ఆండ్రీ లాంగ్​మోర్​(40)గా గుర్తించారు. బాధితుల పేర్లు వెల్లడించలేదు. శనివారం ఉదయం 10.45 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. 

నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఇవి జరిగాయన్నారు. అతను బూడిద రంగు ప్యాంటు, ఎరుపు రంగుతో ఉన్న నల్ల షర్ట్​ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడి సమాచారాన్ని అందిస్తే పది వేల డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.