పోషకాల ఫుడ్‌‌కే  మా ఓటు

పోషకాల ఫుడ్‌‌కే  మా ఓటు

ఈ మధ్య హెల్త్‌‌ పట్ల చాలామందిలో అవేర్‌‌‌‌నెస్‌‌ బాగా పెరిగింది. ముఖ్యంగా యువతలో. రోడ్‌‌ సైడ్‌‌ జంక్‌‌ ఫుడ్‌‌ తినడం మానేసి, హెల్దీగా ఉండటానికి ‘ఏం తినాలి? ఏం తినకూడదు?’ అని తెలుసుకొని ఆ ఫుడ్‌‌ తినడమేకాకుండా... ఇంట్లో వాళ్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. వాళ్లలో ఇంతగా అవేర్‌‌‌‌నెస్‌‌ వచ్చి, లైఫ్‌‌ స్టైల్ మొత్తం మారడానికి కారణం కొవిడ్‌‌ అని చెప్తున్నారు చాలామంది.
ఇంట్లో చేసే ఫుడ్ నచ్చని సాయికృష్ణ ఎక్కువ శాతం బయటే తినేవాడు. దాంతో శరీరంలో సరైన ఇమ్యూనిటీ, ఫిట్‌‌నెస్ లేక అతనికి కరోనా వచ్చింది. అది తగ్గడానికి హాస్పిటల్‌‌లో చేరి, చాలా కష్టపడ్డాడు. ఆ ఎక్స్‌‌పీరియెన్స్‌‌తో అప్పటినుంచి జంక్‌‌ ఫుడ్‌‌ తినడం మాని హెల్దీ ఫుడ్‌‌ తినడం మొదలుపెట్టాడు. అలానే దినేష్‌‌ కూడా జిమ్‌‌ చేస్తూ, దానికోసం ప్రొటీన్ పౌడర్స్‌‌, సప్లిమెంట్స్‌‌ వాడేవాడు. కొవిడ్‌‌ లాక్‌‌డౌన్‌‌లో సప్లిమెంట్స్‌‌ ప్రొడక్షన్‌‌ తగ్గింది. అవి దొరకడం కూడా కష్టమైంది. దాంతో ట్రైనర్ల సలహాతో ఇంట్లో ఉండే న్యూట్రిషనల్ ఫుడ్‌‌ తినడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకి సప్లిమెంట్స్‌‌ కంటే న్యూట్రిషనల్‌‌ ఫుడ్‌‌తోనే మంచి రిజల్ట్‌‌ వస్తున్నట్టు గమనించి, అప్పటినుంచి ఆ ఫుడ్‌‌నే తింటున్నాడు. ఇలా చాలామంది వాళ్ల ఫుడ్‌‌ హ్యాబిట్స్ మార్చుకొని, మంచి ఫుడ్‌‌ తింటూ ఆరోగ్యంగా ఉంటున్నారు. డాక్టర్లు కూడా కొవిడ్ రావడానికి ముఖ్య కారణం శరీరంలో సరైన ఇమ్యూనిటీ లేకపోవడం, అనారోగ్యకర ఆహార అలవాట్లు అని చెప్తుంటారు. దాని వల్లే కాబోలు చాలామందికి హెల్దీ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అర్థమైంది. అప్పటినుంచి న్యూస్‌‌ పేపర్‌‌‌‌, టీవీ, యూట్యూబ్‌‌ల్లో న్యూట్రిషనిస్ట్‌‌లు ఇచ్చే సలహాలు పాటించడం మొదలుపెట్టారు. జంక్ ఫుడ్‌‌ తినడం వల్ల శరీరానికి కలిగే నష్టాలు తెలుసుకుని, అలాంటి ఫుడ్‌‌కి దూరంగా ఉంటున్నారు చాలామంది. దాంతో ఫుడ్ బిజినెస్‌‌ చేసేవాళ్లు కూడా న్యూట్రిషనల్‌‌ ఫుడ్ తయారుచేసి అమ్మడం మొదలుపెట్టారు. 

సమస్యలకు చెక్‌‌ పెట్టా


కొవిడ్‌‌కి ముందు జంక్‌‌ ఫుడ్‌‌ తినే అలవాటు ఉండేది. వీకెండ్స్​లో పార్టీలకి వెళ్లి ఇంకా ఎక్కువే తినేవాళ్లం. దానివల్ల బాడీలో ఫ్యాట్‌‌ పెరిగింది. జుట్టు రాలడం లాంటి సమస్యలు మొదలయ్యాయి. కొవిడ్‌‌ టైంలో చాలావరకు లైఫ్‌‌ స్టైల్‌‌ మారిపోయింది. హెల్దీ (న్యూట్రిషనల్‌‌) ఫుడ్ మీద అవేర్‌‌‌‌నెస్ వచ్చింది. అప్పటినుంచి మంచి డైట్‌‌ ఫాలో అవుతున్నా. ఇప్పుడు నా ఆరోగ్య సమస్యలన్నీ తగ్గాయి. - జి. ఉమా భారతి, ఉద్యోగిని.

అంతా మారిపోయింది


ఇదివరకు రోడ్‌‌ సైడ్‌‌ ఫుడ్‌‌ రోజూ తినేవాళ్లం. దానివల్ల మాటిమాటికి అనారోగ్య సమస్యలు వచ్చేవి. కానీ, కొవిడ్‌‌ వచ్చాక కావాల్సిన ఫుడ్‌‌ ఇంట్లోనే తయారుచేసుకొని తినేవాళ్లం. లాక్‌‌డౌన్ ఎత్తేశాక  ఎక్కడ శుభ్రంగా ఉంటుంది, ఏ షాప్‌‌లో మాస్క్‌‌, గ్లౌజ్‌‌లు వాడుతూ హైజిన్ ఫుడ్‌‌ తయారుచేస్తారో తెలుసుకొని అక్కడికెళ్లి తింటున్నా. ఇప్పుడు ఫుడ్‌‌ పాయిజన్ లాంటి సమస్యలు కొంత తగ్గాయి.
- మహాదేవి, స్టూడెంట్‌‌. 

‘సమస్య వచ్చే వరకు చూడటంకంటే, అది రాకుండా ముందు జాగ్రత్త పడటం మేలు. అందుకు టైం ప్రకారం న్యూట్రిషనల్‌‌ ఫుడ్‌‌ తినడంతోపాటు ఎక్సర్‌‌‌‌సైజ్‌‌, యోగా చేయాలి. పిల్లలకు చిన్నప్పటినుంచే హెల్దీ ఫుడ్‌‌ అంటే..ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్‌‌, కోడి గుడ్డు, పండ్లు లాంటివి పెడితే బలంగా తయారవుతారు. న్యూట్రిషనల్ ఫుడ్‌‌ని వాళ్లకు నచ్చేలా తయారుచేసి పెట్టడం బెటర్‌‌‌‌.’ 
- డా. సుజాత, న్యూట్రిషనిస్ట్‌‌, యశోద హాస్పిటల్‌‌. హైదరాబాద్