కులం, ఆదాయ ధృవపత్రాల కోసం జనం తిప్పలు.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసనలు

కులం, ఆదాయ ధృవపత్రాల కోసం జనం తిప్పలు.. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసనలు

తెలంగాణ ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఆర్థిక సాయంపై బీసీ కుల వృత్తులు, చేతివృత్తుల వారిలో ఆందోళన నెలకొంది. గడువులోగా దరఖాస్తు చేసుకోవడానికి ధ్రువీకరణ పత్రాల కోసం షాద్ నగర్ లో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని MRO కార్యాలయం వద్ద ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. నిరసన తెలిపారు. 

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నినాదాలు చేశారు. త్వరితగతిన కులం, ఆదాయ పత్రాలు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజల నిరసనలకు స్థానిక కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలందరికీ రుణసాయం చేయాలని డిమాండ్ చేశారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో అధికారులు తగిన చర్యలు చేపట్టకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హెచ్చరించారు. ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.