రెట్టింపు సంఖ్యలో కండ్లకలక కేసులు.. నార్సింగి ఆసుపత్రికి క్యూ కట్టిన జనం

రెట్టింపు సంఖ్యలో కండ్లకలక కేసులు.. నార్సింగి ఆసుపత్రికి క్యూ కట్టిన జనం

మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న కండ్లకలక కేసులు ఇప్పుడు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి కండ్లకలక అనుమానిత బాధితులు క్యూ కడుతున్నారు. 

వాన కాలంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంటువ్యాధి కావడంతో ఫ్యామిలీలో ఒకరికి వచ్చినా మరొకరి కూడా వ్యాపిస్తోంది. దీంతో పలు కుటుంబాలు ఆందోళనతో ఆసుపత్రుల బాట పట్టాయి. 

అనుమానితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నార్సింగి ఆసుపత్రిలో గ్రామాల నుంచి వస్తున్న ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వైద్యులు వారికి టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేసి మందులు రాసి పంపుతున్నారు. కళ్లలోంచి నీరు.. ఒళ్లు నొప్పులు తదితర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారు వెంటనే ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు.