చాలా రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారు: శరద్ పవార్

చాలా రాష్ట్రాల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారు: శరద్ పవార్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఫైర్ 

షిర్డీ: దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీ ని ప్రజలు తిరస్కరించారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దర్యాప్తు సంస్థలను ప్రయోగించి గోవా, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపించారు.

అనారోగ్యంతో ముంబై లోని ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న పవార్.. శనివారం డాక్టర్ల టీమ్​తో కలిసి హెలికాప్టర్​లో షిర్డీకి వెళ్లారు. అక్కడ పార్టీ మీటింగ్​లో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి దేశాభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదని పవార్ విమర్శించారు.

మహారాష్ట్రలో పొలిటికల్ ఛేంజ్ తీసుకొస్తామని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యా న్ని కాపాడేందుకు, మతతత్వ శక్తులను ఓడించేందుకు పోరాడాలని కార్యకర్త లకు పిలుపునిచ్చారు. ఉద్ధవ్ నేతృత్వం లోని శివసేన, కాంగ్రెస్ భాగమైన మహా వికాస్ అఘాడీలో ఎన్సీపీ కొనసాగుతుందని స్పష్టంచేశారు.