నా మొగుడు నా ఇష్టం : సరిజోడీ కోసం వాళ్లకు వాళ్లే వెతుక్కుంటున్నారిలా..!

నా మొగుడు నా ఇష్టం : సరిజోడీ కోసం వాళ్లకు వాళ్లే వెతుక్కుంటున్నారిలా..!

డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ వెబ్సైట్లు వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్ నర్ ని వెతుక్కోవడం ఈజీ అయింది. జీవిత భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అనే విషయంలో ఈ కాలం అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనలు మారుతున్నాయి. చాలామంది ఆన్లైన్ చాటింగ్చేసి, అవతలి వాళ్ల మీద ఒక అంచనాకి వస్తున్నారు. సొంతంగా డెసిషన్ కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు తమకి అన్ని విధాలా మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరికేంత వరకు కాంప్రమైజ్ అవ్వట్లేదు.

ముగ్గురిలో ఒక్కరు

“ఈ జనరేషన్ వాళ్లలో 67 శాతం మంది డేటింగ్ యాప్స్ ద్వారానే తమకి సరైన జోడిని వెతుక్కుంటున్నారు. ఈరోజుల్లో అమెరికాలోని ప్రతి మూడు జంటల్లో ఒకరు డేటింగ్ యాప్స్ ద్వారానే ఒక్కటవుతున్నారు.మనదేశంలో కూడా ఇదే తీరు కనిపిస్తోంది. ఆన్లైన్ డేటింగ్ సాయంతో తాము కోరుకున్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని కలుసుకునే అవకాశం పెరిగింది" అని చెబుతోంది 'ఓకే క్యుపిడ్' డేటింగ్ యాప్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ తా మీనన్.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స తో

"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వారివారి ఇష్టాలు, ప్రిఫరెన్స్ కి సరిపోయే వ్యక్తిని వెతకడం మరింత సులువైంది. డేటింగ్ యాప్లో కోరుకునే వ్యక్తి వయసు, ఎత్తు, ఎక్కడ ఉంటారు? ఎంత చదువుకున్నారు? ఎంత సంపాదిస్తున్నారు? వంటి వివరాలు చెబితే చాలు... . మ్యాచ్ అయిన అమ్మాయి లేదా అబ్బాయిల ప్రొఫైల్ కనిపిస్తుంది అంటున్నాడు. 'బెటర్ హాఫ్ ఎఐ' అనేడేటింగ్ యాప్ సీఈవో పవన్ గుప్తా.