భవిష్యవాణితో ఊరు ఖాళీ చేసిన ప్రజలు

భవిష్యవాణితో ఊరు ఖాళీ చేసిన ప్రజలు

కరోనా వైరస్ నుంచి గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ గ్రామ ప్రజలు ఊరిని వదిలి వెళ్లారు. మూడు రోజుల పాటు ఎవరూ ఆ గ్రామంలోకి వెళ్లకుండా ఊరి పొలిమెరలోనే గడిపారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. తమకూరు జిల్లా ముద్దనహళ్లిలో ఆ గ్రామ దేవత మారమ్మదేవి..ఓ మహిళకు పూని భవిష్యవాణి చెబుతూ ఉండేది. లేటెస్టుగా గ్రామాని కరోనా ప్రమాదం పొంచి ఉందని…వెంటనే గ్రామ ప్రజలు అంతా ఊరి విడిచి వెళ్లాలని చెప్పింది. అంతేకాదు మూడు రోజుల వరకు గ్రామం వైపు ఎవరూ చూడకూడదంటూ భవిష్యవాణిలో చెప్పిందట. దీంతో తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు ఆ ఊరి ప్రజలు… గ్రామానికి వెళ్లే దారిని మూసివేసి, ఊరి చివరి పొలాల్లో చిన్నచిన్న డేరాలు వేసుకున్నారు. వాటిలోనే  ఉంటున్నారు. వారితో పాటు… పశువులను కూడా అక్కడికి తరలించడంతో గ్రామమంతా నిర్మానుష్యంగా మారింది.