రుణ మాఫీ ఎక్కడని ఎంపీని నిలదీసిన ప్రజలు

రుణ మాఫీ ఎక్కడని ఎంపీని నిలదీసిన ప్రజలు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి కి  ప్రచారంలో భాగంగా అడుగడుగున నిరసనలు, నిలదీతలు ఎదురయ్యాయి. శనివారం రేకులకుంట, రాజక్కపేట, ఎల్లారం, బల్వాంతాపుర్, పద్మశాలి గడ్డ, నర్లెంగ గడ్డ,  చెల్లాపూర్, దుంపలపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లాపూర్ రెండో వార్డుకు రాగానే అక్కడున్న మహిళలు తమకు రుణ మాఫీ  రాలేదని అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ నాయకులు సర్ది చెప్పి బయటకు పంపించారు.

అనంతరం  దుంపలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతుండగా స్థానికులు ఒక్కసారిగా రైతులకు రుణ మాఫీ కాలేదని, దళిత బంధు, బీసీ బంధు, గృహ లక్ష్మి ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని అడ్డుకునే ప్రయత్నం చేశారు.