టెక్నాలజీ : పర్ఫెక్ట్ ఎస్సెమ్మెస్​ ఫీచర్..ఇక నుంచి గూగుల్ లోనే

టెక్నాలజీ  : పర్ఫెక్ట్ ఎస్సెమ్మెస్​ ఫీచర్..ఇక నుంచి గూగుల్ లోనే

 వాట్సాప్​ వచ్చాక షార్ట్ మెసేజ్​ సర్వీస్​ (ఎస్సెమ్మెస్​)​  లు వాడడం తక్కువైంది. కానీ, స్మార్ట్ ఫోన్ రాకముందు ఎస్సెమ్మెస్​ చేయడానికి సపరేట్​గా బ్యాలెన్స్ వేయించుకునేవాళ్లు కదా! ఇప్పుడు గూగుల్ మెసేజెస్ యాప్​ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఆ ఫీచర్​తో ఎస్సెమ్మెస్​​లు పంపాలనుకునేవాళ్లు ఫుల్ ఖుషీ.ఆ ఫీచర్ ఏంటంటే...

‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో ప్రభాస్, కాజల్ బర్త్​డే విషెస్​ చెప్పడానికి వీడియో మెసేజ్​ ​ పంపి సర్​ప్రైజ్ చేసే సీన్ గుర్తుందా? ఆ సీన్​లో హీరో, హీరోయిన్​ పక్కన కూర్చుని మాట్లాడుతుంటాడు. టైం అర్ధరాత్రి 12 గంటలు కాగానే హీరోయిన్ ఫోన్​కి మెసేజ్ వస్తుంది. తన పక్కనే ఉన్నతను ఇంత షార్ప్​గా టైంకి ఎలా మెసేజ్ చేశాడా? అని ఆశ్చర్యపోతుంది. దానికి హీరో... ‘మెసేజ్​ టైప్ చేసి టైం సెట్ చేస్తే, ఆ టైంకి సెండ్ అవుతుంద’ని చెప్తాడు. అచ్చం అలానే... గూగుల్ మెసేజెస్​లో కూడా డేట్, టైం సెట్ చేసుకోవచ్చు. 

అదెలాగంటే.. 

గూగుల్ మెసేజెస్​ యాప్​ ఓపెన్ చేయాలి. అప్పటికే ఎవరితోనైనా చాట్ చేసుంటే స్టార్ట్ చాట్ మీద ట్యాప్ చేయాలి లేదంటే కాంటాక్ట్​ లిస్ట్​లో నుంచి కన్వర్జేషన్ సెలక్ట్ చేయాలి. కొత్తగా కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలంటే పేరు లేదా ఫోన్ నెంబర్ సెర్చ్​లో టైప్ చేసి, కాంటాక్ట్​ లిస్ట్​లో ఒకటి సెలక్ట్​ చేసుకోవాలి. కన్వర్జేషన్ బాక్స్​ మీద క్లిక్ చేసి మెస్సేజ్​​ టైప్ చేయాలి. అది ఫలానా టైంకి వెళ్లాలి అనుకుంటే బాక్స్ పక్కన కనిపించే ప్లస్ గుర్తు క్లిక్ చేయాలి.

 లేదంటే సెండ్ బటన్​ని కాసేపు ఒత్తి పట్టాలి. అప్పుడు ‘షెడ్యూల్డ్ సెండ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో డిఫాల్ట్​గా కొన్ని టైమింగ్స్ కనిపిస్తాయి. అవసరాన్ని బట్టి టైం సెలక్ట్ చేసుకోవచ్చు. లిస్ట్​లో లేని టైంకి ఎస్సెమ్మెస్​ పంపాలంటే ‘పిక్ డేట్అండ్ టైం’ మీద క్లిక్ చేయాలి. క్యాలెండర్​లో కనిపించే తేదీ, టైం సెలక్ట్ చేసి సెట్ బటన్​ నొక్కాలి. అప్పుడు సెట్​ చేసిన టైం, డేట్ కనిపిస్తాయి. 

తర్వాత సెండ్ గుర్తు నొక్కితే ఆ మెసేజ్​ అవతలి వ్యక్తి చాట్​కు యాడ్ అవుతుంది. దాని పక్కన షెడ్యూల్డ్ గుర్తు కనిపిస్తుంది. అంటే సెట్ చేసిన టైంకి మెసేజ్​ వెళ్తుందన్నమాట. ఏ రోజు, ఎప్పుడు అందింది అనే వివరాలు కనిపిస్తాయి.