ఢిల్లీలోని భారత్ పర్వ్‌‌లో ‘పేరిణి శివతాండవం’

ఢిల్లీలోని భారత్ పర్వ్‌‌లో ‘పేరిణి శివతాండవం’

న్యూఢిల్లీ, వెలుగు: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఉద్దేశంతో ఢిల్లీలోని ఎర్రకోట లాన్స్‌‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ భారత్ పర్వ్ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం తెలంగాణ సంస్కృతి, కళా రూపాన్ని చాటేలా ‘తెలంగాణ డే’ను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళాకారులు నిర్వహించిన పేరిణి శివతాండం ఢిల్లీ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 800 ఏండ్ల క్రితం కాకతీయ పాలనలో పేరిణి నృత్య రూపం తెలంగాణలో ఉద్భవించింది. 

యుద్ధభూమికి వెళ్లే ముందు శివుడి గౌరవార్థం ఉత్సాహాంగా ప్రదర్శించే ఈ నృత్యాన్ని ‘యోధుల నృత్యం’గా పిలుస్తున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ భవన్ రెసిడెంట్‌‌ కమిషనర్‌‌ శశాంక్ గోయల్ అతిథిగా హాజరై, కళాకారులను అభినందించారు.